పందెం రాయుళ్లు అరెస్ట్..!

పందెం రాయుళ్లు అరెస్ట్..!

W.G: దెందులూరు మండలం పోతునూరులో కోడి పందేలు నిర్వహిస్తున్న స్థావరంపై పోలీసులు మెరుపు దాడి చేసి 9 మందిని అరెస్ట్ చేశారు. ఎస్సై శివాజీ తెలిపిన వివరాల ప్రకారం.. పట్టుబడిన వారి నుంచి రూ. 6,100 నగదు, 5 పందెం కోళ్లు స్వాధీనం చేసుకున్నారు. పోతునూరు గ్రామ శివార్లలో రహస్యంగా కోడి పందేలు జరుగుతున్నాయన్న సమాచారంతో ఈ దాడులు నిర్వహించారు.