వ్యోమగామి శిక్షణకు ఎంపికైన తెలుగమ్మాయి

వ్యోమగామి శిక్షణకు ఎంపికైన తెలుగమ్మాయి

AP: తూర్పుగోదావరి జిల్లా నిడదవోలుకు చెందిన కైవల్యరెడ్డి అనే యువతి అరుదైన ఘనత సాధించింది. అమెరికా ఫ్లోరిడాలోని టైటాన్ స్పేస్ ఇండస్ట్రీస్ ఆధ్వర్వంలో చేపట్టే వ్యోమగామి శిక్షణకు ఎంపికైంది. చిన్ననాటి నుంచి స్పేస్‌కు సంబంధించిన అంశాలపై ఆసక్తి ఉండేదని, తన కళ నెరవేరిందని ఆమె హర్షం వ్యక్తం చేసింది. ఆ యువతిని తల్లిదండ్రులు, గ్రామస్తులు అభినందించారు.