టాస్క్ ఫోర్స్ దాడి.. ఐస్ క్రీమ్ సీజ్
WGL: నగరంలోని బాలాజినగర్‌లో అనుమతి లేకుండా ఐస్ క్రీమ్ విక్రయిస్తున్న సమాచారం మేరకు, శనివారం దుర్గా ఐస్ క్రీమ్ షాప్‌పై టాస్క్ ఫోర్స్ పోలీసులు దాడులు నిర్వహించారు. ఈ దాడిలో ₹37,440/- విలువ గల కాలపరిమితి ముగిసిన ఐస్ క్రీమ్, ఇతర ఫుడ్ స్టాక్‌లను స్వాధీనం చేసుకున్నారు. ఈ ఘటనలో తూరుపాటి పూర్ణచందర్‌పై కేసు నమోదు చేసినట్లు ఏసీపీ మధుసూదన్ తెలిపారు.