కలెక్టర్‌కు జల సంరక్షణ అవార్డు.. మంత్రి అభినందనలు

కలెక్టర్‌కు జల సంరక్షణ అవార్డు.. మంత్రి అభినందనలు

WGL: దక్షిణ భారతదేశం జల సంరక్షణ కేటగిరి–2లో వరంగల్ జిల్లా మొదటి స్థానం సాధించింది. ఈ మేరకు డిల్లీలో జరిగిన కార్యక్రమంలో అవార్డు‌తో పాటు రూ.1 కోటి అందుకున్న కలెక్టర్ సత్య శారద బుధవారం హైదరాబాద్‌లో మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డిని మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా మంత్రి కలెక్టర్‌ను అభినందిస్తూ, జల సంరక్షణలో జిల్లాను ఆదర్శంగా నిలిపినందుకు ప్రశంసించారు.