VIDEO: ఎలక్ట్రిక్ RTC బస్సులో అగ్నిప్రమాదం
వరంగల్-2 డిపోలో తెల్లవారుజామున ఎలక్ట్రిక్ RTC బస్సులో మంటలు చెలరేగాయి. విద్యుత్ షార్ట్ సర్క్యూట్ కారణంగా ఈ అగ్నిప్రమాదం సంభవించినట్లు సమాచారం. ఈ ఘటనలో బస్సు దగ్ధమైంది. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది వెంటనే సంఘటనా స్థలానికి చేరుకుని మంటలను అదుపులోకి తీసుకొచ్చారు. ఇలాంటి ప్రాణా నష్టం జరగకపోవడంతో అంతా ఊపిరి పిల్చుకున్నారు.