బాపట్ల పట్టణంలో రేపు విద్యుత్ అంతరాయం
BPT: పట్టణంలో సోమవారం విద్యుత్ సరఫరా నిలిపివేస్తున్నట్లు అధికారులు తెలిపారు. స్థానిక భావనారాయణ స్వామి ఆలయ పాత రథాన్ని గుడి వద్ద నుంచి తూర్పు సత్రం స్థలానికి తరలిస్తున్నారు. అందువల్ల ముందస్తు జాగ్రత్తగా గడియార స్తంభం నుంచి కొత్త బస్టాండ్ వరకు విద్యుత్ అంతరాయం ఏర్పడుతుంది. మధ్యాహ్నం 3 నుంచి రాత్రి 7 గంటల వరకు కరెంటు నిలిపివేయనున్నారు.