కొనుగోలు కేంద్రాలను పరిశీలించిన తహసీల్దార్
JGL: ఇబ్రహీంపట్నం మండలం గోదూరు గ్రామాల్లోని వరి ధాన్యం కొనుగోలు కేంద్రాలను తహసీల్దార్ వరప్రసాద్ ఆకస్మికంగా పరిశీలించారు. కేంద్రాలకు వచ్చిన ధాన్యం వివరాలు, ఇప్పటివరకు సేకరించిన పరిమాణం వంటి వివరాలను సిబ్బందిని అడిగి తెలుసుకున్నారు. రైతుల నుంచి సేకరించిన ధాన్యం వివరాలను ఆలస్యం చేయకుండా ఆన్లైన్లో తప్పనిసరిగా నమోదు చేయాలని ఆయన సిబ్బందికి సూచించారు.