ఘోర రోడ్డు ప్రమాదం.. ముగ్గురికి తీవ్ర గాయాలు
ప్రకాశం: మర్రిపూడి మండలం ధర్మవరం జువ్విగుంట గ్రామాల మధ్య రెండు ద్విచక్ర వాహనాలు ఎదురెదురుగా ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో ముగ్గురికి తీవ్ర గాయాలయ్యాయి. పొదిలి వైపు నుంచి కొండపి వెళ్తున్న వాహనం, కొండపి నుంచి పొదిలి వైపు వస్తున్న వాహనం ఢీకొనడంతో ఈ దుర్ఘటన జరిగింది. గాయపడిన ముగ్గురిని పొదిలి వైద్యశాలకు తరలించినట్లు సమాచారం. ఈ ఘటనపై పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.