'అభివృద్ధి పేరిట భూములు లాక్కోవడం సరికాదు'
VKB: పారిశ్రామికాభివృద్ధి పేరిట భూములు లాక్కోవాలని చూడటం సరికాదని రాపోల్ గ్రామస్తులు అన్నారు. ప్రభుత్వ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ నిన్న గ్రామస్తులు TPJAC, వ్యవసాయ కార్మిక సంఘం, CITU సంఘాల ఆధ్వర్యంలో భూ సేకరణకు వ్యతిరేకంగా పోరాటాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. పారిశ్రామిక పార్కు పేరుతో 1,200 ఎకరాల వరకు పేదల భూములను తీసుకునేందుకు ప్రయత్నిస్తోందని ఆరోపించారు.