హరే కృష్ణ గోకుల క్షేత్రంలో రావణ దహనం

హరే కృష్ణ గోకుల క్షేత్రంలో రావణ దహనం

GNTR: విజయదశమిని పురస్కరించుకుని తాడేపల్లిలోని హరే కృష్ణ గోకుల క్షేత్రంలో గురువారం నాడు 35 అడుగుల రావణాసురుణ్ణి దహనం చేయనున్నట్లు క్షేత్రం ప్రతినిధులు బుధవారం తెలిపారు. విజయదశమి అనేది దశముఖ రావణాసురుణ్ణి సంహరించి, చెడుపై శ్రీ రాములవారు గెలిచిన రోజు అని వారు పేర్కొన్నారు. కార్యక్రమం గురువారం సాయంత్రం 6:30 నుంచి 8 గంటల వరకు జరుగుతుందన్నారు.