నేడు మండల సర్వసభ్య సమావేశం

నేడు మండల సర్వసభ్య సమావేశం

ప్రకాశం: బేస్తవారిపేట మండల సర్వసభ్య సమావేశం శనివారం ఉదయం 11 గంటలకు ఎంపీపీ ఓసూరారెడ్డి అధ్యక్షతన నిర్వహిస్తున్నట్లు ఎంపీడీవో రంగనాయకులు తెలిపారు. ఆయన మాట్లాడుతూ.. ఈ సమావేశానికి మండలంలోని ఎంపీటీసీలు, సర్పంచులు పాల్గొని వారి సమస్యలను సమావేశంలో తెలపాలని కోరారు. ఈ సమావేశానికి మండలంలోని అన్ని శాఖల అధికారులు తగు సమాచారంతో హాజరు కావాలని ఆయన తెలిపారు.