VIDEO: మదనపల్లెలో అధికారులపై ‘రిపోర్టర్’ రుబాబు

VIDEO: మదనపల్లెలో అధికారులపై ‘రిపోర్టర్’ రుబాబు

అన్నమయ్య: మదనపల్లెలో నిబంధనలకు విరుద్ధంగా ప్రయాణికులను తరలిస్తున్న కార్లపై రవాణా శాఖ అధికారులు తనిఖీలు నిర్వహించారు. ఈ సమయంలో తాను రిపోర్టర్ అని చెప్పుకుంటూ ఓ యువకుడు అధికారులను వీడియో తీస్తూ బెదిరించి విధులకు ఆటంకం కలిగించాడు. కేసు వేయండి.. మేము చూసుకుంటాం అంటూ బ్లాక్ మెయిల్ చేయడం కలకలం రేపింది. దీంతో ఆ యువకుడి ప్రవర్తనపై అధికారులు విస్మయం వ్యక్తం చేశారు.