మంత్రి ఉత్తమ్‌కు హరీశ్ రావు బహిరంగ లేఖ
MDK: రాష్ట్ర నీటి పారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డికి మాజీ మంత్రి హరీశ్ రావు బహిరంగ లేఖ రాశారు. కాళేశ్వరం, దేవాదుల వంటి భారీ ఎత్తిపోతల పథకాల్లో మోటార్లను పదేపదే ఆన్, ఆఫ్ చేయడంపై ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. ఇంజనీరింగ్ నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరిస్తే వైబ్రేషన్స్ పెరిగి పంపులు, మోటార్లు పాడైపోయే ప్రమాదముందని హెచ్చరించారు.