తెలంగాణ జాగృతిలో చేరిన సబ్బని కృష్ణ
MNCL: బెల్లంపల్లి పట్టణానికి చెందిన BRS సీనియర్ నాయకుడు సబ్బని కృష్ణ మంగళవారం తెలంగాణ జాగృతిలో చేరారు. హైదరాబాద్ జాగృతి కార్యాలయంలో సంస్థ అధ్యక్షురాలు, MLC కవిత ఆయనకు కండువా కప్పి సాదరంగా ఆహ్వానించారు. ఆమె మాట్లాడుతూ.. పార్టీ బలోపేతానికి చురుగ్గా కృషి చేయాలని సూచించారు. గతంలో MCPI (U)లో పనిచేసిన కృష్ణ, ఆ అనుభవంతో జాగృతిని మరింత ముందుకు తీసుకెళ్ళాలన్నారు.