నేడు బొల్లవరంలో క్రికెట్ టోర్నమెంట్
NDL: నందికొట్కూరు మండలం బొల్లవరంలో క్రిస్మస్ పండుగ సందర్భంగా ఇవాళ జిల్లాస్థాయి క్రికెట్ టోర్నమెంట్ నిర్వహిస్తున్నట్లు నిర్వాహకులు పేర్కొన్నారు. ఈ టోర్నమెంట్లో గెలిచిన టీములకు వరసగా మొదటి బహుమతిగా రూ.30,000, రెండో బహుమతి రూ.20,000, మూడో బహుమతి రూ. 10,000, నాలుగో బహుమతిగా రూ.5,000 నగదు అందజేస్తామని తెలిపారు.