VIDEO: రోజురోజుకు పెరుగుతున్న పిచ్చికుక్కల సంఖ్య

BHPL: గోరికొత్తపల్లి మండల కేంద్రంలోని నిజాంపల్లి గ్రామంలో పిచ్చికుక్కల సంఖ్య రోజురోజుకు పెరుగుతోంది. అధికారుల నిర్లక్ష్యంతో కుక్కల సంఖ్య అధికమై, స్థానికులను భయాందోళనకు గురిచేస్తున్నాయి. కాగా, సోమవారం ఓ పిచ్చికుక్కను గ్రామస్తులు వెంబడించి చంపారు. అధికారులు వెంటనే స్పందించి, ఈ సమస్యపై చర్యలు తీసుకోవాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు.