నేడు విద్యుత్ సరఫరాలో అంతరాయం
CTR: పెనుమూరు, గంగాధర నెల్లూరు, పాలసముద్రం మండలాల పరిధిలోని విద్యుత్ ఉప కేంద్రాల్లో చేపట్టనున్న మరమ్మతుల కారణంగా శనివారం విద్యుత్ సరఫరాలో అంతరాయం ఉంటుందని డీఈ శేషాద్రిరెడ్డి తెలిపారు. ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు విద్యుత్ సరఫరా నిలిపివేస్తున్నట్లు పేర్కొన్నారు. విద్యుత్ వినియోగదారులు ఈ అంతరాయానికి సహకరించాలని కోరారు.