'ప్రజా వేదికలో సమస్యలకు పరిష్కారం'

'ప్రజా వేదికలో సమస్యలకు పరిష్కారం'

ASR: పాడేరు మాజీ ఎమ్మెల్యే గిడ్డి ఈశ్వరి ఆధ్వర్యంలో శుక్రవారం ఆమె క్యాంపు కార్యాలయంలో ప్రజా వేదిక నిర్వహించారు. ప్రజలు తెలియజేసిన సమస్యలను సావధానంగా విని కొన్నింటిని అక్కడికక్కడే పరిష్కరించారు. మరికొన్ని సమస్యలపై సంబంధిత అధికారులతో మాట్లాడి చర్యలు తీసుకోవాలని సూచించారు. ప్రజల వినతులను సంబంధిత శాఖలకు పంపించారు.