ఆర్ అండ్ బీ రోడ్డును పరిశీలించిన ఎమ్మెల్యే
TPT: నాయుడుపేటలోని గాంధీ మందిరం సెంటర్ నుంచి పిచ్చిరెడ్డి తోపు వరకు వెళ్ళే రోడ్డు పరిస్థితి అత్యంత ప్రమాదకరంగా తయారైంది. ఈ రోడ్డును ఎమ్మెల్యే నెలవల విజయశ్రీ శనివారం పరిశీలించారు. ఈ మేరకు రహదారి పునర్నిర్మాణానికి చర్యలు తక్షణమే ప్రారంభించేలా సంబంధిత అధికారులతో చర్చించారు. అనంతరం రాకపోకలు సక్రమంగా జరిగేలా రహదారి పనులు త్వరలో ప్రారంభిస్తామని ఎమ్మెల్యే తెలిపారు.