'చెత్త తొలగింపులోనూ వైసీపీ నిర్లక్ష్యం చేసింది'

AP: నెల్లూరు జిల్లా అల్లిపురంలో మంత్రి నారాయణ పర్యటిస్తున్నారు. ఈ క్రమంలో డంపింగ్ యార్డ్‌ను, బయోమైనింగ్ రీసైక్లింగ్ యూనిట్‌ను పరిశీలించారు. అనంతరం మాట్లాడుతూ.. 'రాష్ట్రంలో రోజూ 6,500 టన్నుల చెత్త వస్తుంది. అక్టోబర్ 2 నాటికి రాష్ట్రంలోని చెత్తను క్లీన్ చేయాలని సీఎం చంద్రబాబు ఆదేశించారు. చెత్త తొలగింపు కాంట్రాక్టులోనూ గత ప్రభుత్వం నిర్లక్ష్యం చేసింది' అని అన్నారు.