ట్రాక్టర్ ఢీకొని వృద్ధుడికి తీవ్రగాయాలు

ట్రాక్టర్ ఢీకొని వృద్ధుడికి తీవ్రగాయాలు

GDWL: అయిజ మున్సిపాలిటీ కేంద్రంలోని పాత బస్టాండ్‌లో ఆదివారం రోడ్డు ప్రమాదం జరిగింది. ​దుర్గా నగర్‌కు చెందిన చాకలి వెంకట్రాముడు రోడ్డు దాటుతుండగా, గద్వాల్ రోడ్డు వైపు నుంచి వస్తున్న స్వరాజ్ ట్రాక్టర్ ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో అతని కాలు విరిగినట్లు స్థానిక సమాచారం. ఈ ఘటనకు సంబంధించిన పూర్తి సమాచారం తెలియాల్సి ఉంది.