నేడు దివ్యాంగులకు ప్రత్యేక గ్రీవెన్స్
SKLM: జిల్లా పరిషత్ సమావేశం మందిరంలో శుక్రవారం దివ్యాంగులకు ప్రత్యేక గ్రీవెన్స్ నిర్వహించనున్నట్లు సహాయ సంచాలకులు బి.శైలజ గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. ప్రతి నెలా మూడో శుక్రవారం నిర్వహించే ఈ గ్రీవెన్స్ సెల్లో దివ్యాంగులు తమ సమస్యలపై ఫిర్యాదు చేసుకోవచ్చు అని తెలిపారు. ఈ గ్రీవెన్స్‌ను దివ్యాంగులు సద్వినియోగం చేసుకోవాలని ఆమె తెలిపారు.