గణేష్ ఉత్సవాలను ప్రశాంత వాతావరణంలో జరపాలి: కలెక్టర్

SRD: జిల్లాలో గణేష్ ఉత్సవాలను ప్రశాంత వాతావరణంలో జరపాలని జిల్లా కలెక్టర్ ప్రావీణ్య అన్నారు. శనివారం జిల్లా కలెక్టర్ కార్యాలయంలో ఆమె సమీక్ష సమావేశం నిర్వహించారు. మున్సిపల్,విద్యుత్ శాఖ, పోలీస్, రెవెన్యూ, అగ్నిమాపక శాఖ అధికారులు సమన్వయంతో పని చేయాలనీ సూచించారు. ప్రజలు సహకరించాలని కోరారు.