ఈ నెల 20, 21 తేదీల్లో రైతు సంఘం జిల్లా మహాసభలు

ఈ నెల 20, 21 తేదీల్లో  రైతు సంఘం జిల్లా మహాసభలు

SRD: కొండాపూర్‌లో ఈ నెల 20, 21 తేదీల్లో రైతు సంఘం జిల్లా మహాసభలు నిర్వహిస్తున్నట్లు రాష్ట్ర ఉపాధ్యక్షులు జయరాజ్ తెలిపారు. ఈ మేరకు రైతు సంఘం జిల్లా మహాసభల ఏర్పాట్లను ఆదివారం పరిశీలించారు. ఆయన మాట్లాడుతూ.. జిల్లాలో రైతుల ఎదుర్కొంటున్న సమస్యలపై మహాసభలో చర్చిస్తారని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా అధ్యక్షులు రాజయ్య, నాయకులు మాణిక్యం పాల్గొన్నారు.