నేతల విగ్రహాలను అవమానిస్తే చర్యలు: చంద్రబాబు

నేతల విగ్రహాలను అవమానిస్తే చర్యలు: చంద్రబాబు

AP: కృష్ణా జిల్లా కైకలూరులో వంగవీటి మోహన్‌రంగా విగ్రహం పట్ల దుశ్చర్యను సీఎం చంద్రబాబు ఖండించారు. ఇలాంటి చర్యలకు పాల్పడేవారిపై కఠినంగా వ్యవహరించాలని ఆదేశించారు. ఈ ఘటనలో నిందితులను గుర్తించి చర్యలు తీసుకోవాలని సూచించారు. నేతల విగ్రహాల పట్ల అవమానకర చర్యలకు పాల్పడేవారికి బుద్ది చెప్పాలని ఆదేశించారు.