VIDEO: 'చార్మినార్ వద్ద చిన్నారుల సందడి'

HYD: వినాయక నిమజ్జనం సందర్భంగా చార్మినార్ వద్ద చిన్నారుల సందడి నెలకొంది. గణనాథుని శోభాయాత్రలో చిన్నారులు పాల్గొని తమ నృత్యాలతో అందరిని ఆకట్టుకున్నారు. ఎంతో ఉత్సాహంగా చిన్నారులు వేస్తున్న చిందులు అందరినీ ఆకర్షిస్తున్నాయి. మరోవైపు నవరాత్రులు పూజలు అందుకున్న గణపతిని గంగమ్మ ఒడికి తరలిస్తూ భక్తులు భక్తీ పారవశ్యంలో మునిగిపోయారు.