VIDEO: భక్తిప్రపత్తులతో హనుమాన్ జయంతి వేడుకలు

VIDEO: భక్తిప్రపత్తులతో హనుమాన్ జయంతి వేడుకలు

SRPT: జిల్లా కేంద్రంలోని భక్తాంజనేయ స్వామి ఆలయంలో హనుమాన్ జయంతి వేడుకలు ఇవాళ వైభవంగా జరిగాయి. తెల్లవారుజాము నుంచే భక్తులు ఆలయానికి పోటెత్తారు. స్వామి వారికి ప్రత్యేక అభిషేకాలు, ఆకుపూజలు నిర్వహించారు. భక్తుల ‘రామ నామ’ స్మరణతో ఆలయ ప్రాంగణం మారుమోగింది. భక్తులు భజనలు చేస్తూ స్వామి వారిని దర్శించుకుని మొక్కులు తీర్చుకున్నారు.