VIDEO: వడదెబ్బతో రైతు మృతి
MHBD: జిల్లా కంబాలపల్లిలో మంగళవారం విషాద ఘటన చోటుచేసుకుంది. స్థానికుడైన రైతు అయోధ్య పశువులను మేపడానికి పొలం వద్దకు వెళ్లారు. భానుడి ప్రతాపానికి తీవ్ర అస్వస్థతకు గురై ఒక్కసారిగా కుప్పకూలిపోయారు. గమనించిన తోటి రైతులు ఆయన దగ్గరికి వెళ్ళగా.. అప్పటికే ఆయన మృతి చెందినట్లు తెలిపారు. ఎండ తీవ్రత పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వైద్యులు సూచించారు.