దేవరకొండలోని 300 గ్రామాలకు నీళ్లు బంద్.!
NLG: దేవరకొండ నియోజకవర్గంలోని పలు గ్రామాలకు మూడు రోజులపాటు నీటి సరఫరా నిలిచిపోనుంది. నాంపల్లి(M)లోని ఎస్.లింగోటం పంప్‌హజ్ వద్ద 440 స్థాయి పంపుల బెరింగ్‌లు శనివారం అకస్మాత్తుగా విరిగిపోవడంతో ఈ అంతరాయానికి కారణమని అధికారులు తెలిపారు. దీంతో కోదండాపురం-110, పెండ్లిపాకల-65, చందంపేట, డిండి, చింతపల్లి, కొండమల్లేపల్లి, దేవరకొండలోని మొత్తం 300 గ్రామాలకు నీటి సరఫరా ఆగిపోనుంది.