పేకాడుతున్న ఆరుగురు అరెస్ట్

పేకాడుతున్న ఆరుగురు అరెస్ట్

CTR: పలమనేరు మున్సిపాలిటీ పరిధిలోని గొబ్బిళ్ల కోటూరు సమీపంలో పేకాడుతున్న ఆరుగురిని పలమనేరు పోలీసులు అరెస్టు చేశారు. డంపింగ్ యార్డ్ వద్ద 12 మంది పేకాడుతుండగా సీఐ మోహన్ రెడ్డి ఆదేశాలతో ఎస్సై లోకేష్ రెడ్డి సిబ్బందితో కలిసి దాడి చేశారు. 12 మందిలో ఆరుగురు పారిపోగా, ఆరుగురిని అదుపులోకి తీసుకుని వారి నుంచి రూ.41,880 స్వాధీనం చేసుకున్నట్లు సీఐ తెలిపారు.