నందవరంలో 88.6 మి.మీ వర్షపాతం నమోదు

KRNL: ఆదోని డివిజన్‌లో బుధవారం 315.4 మిల్లీ మీటర్ల వర్షపాతం నమోదైంది. నందవరం మండలంలో అత్యధికంగా 88.6 మి.మీ వర్షం కురిసింది. పెదకడబూరు, హోళగుంద, మంత్రాలయం, ఎమ్మిగనూరు తదితర ప్రాంతాల్లో మధ్యస్థంగా వర్షపాతం నమోదైంది. గోనెగండ్ల, కోసిగి, కౌతాళం, ఆదోనిలో తక్కువ వర్షం పడినట్లు వాతావరణ శాఖ అధికారులు వెల్లడించారు.