'తిరుమల వచ్చే భక్తులను అతిథుల్లా ఆదరించాలి'
తిరుమలకు వచ్చే భక్తులను అతిథుల్లా ఆదరించాలని సైకాలజిస్ట్ ఎన్‌బీ.సుధాకర్ రెడ్డి కోరారు. మంగళవారం శ్వేత భవనంలో టీటీడీ ఉద్యోగులకు భావవ్యక్తీకరణ నైపుణ్యాలు, సమన్వయంతో పనిచేయడంపై శిక్షణ ఇచ్చారు. భక్తుల పట్ల సేవా భావం, మర్యాద, సహానుభూతి ప్రదర్శించాలన్నారు. కఠినంగా మాట్లాడటం, హేళన చేయడం తగదన్నారు. అన్ని శాఖల ఉద్యోగులు సమన్వయంతో పనిచేయాలన్నారు.