AP ECETలో రైతు బిడ్డకు మూడో ర్యాంక్

AP ECETలో రైతు బిడ్డకు మూడో ర్యాంక్

AKP: AP ECET ఫలితాల్లో చీడికాడ మండలం ఎల్బీ పట్నం గ్రామానికి చెందిన గండి భావన సత్తాచాటింది. అగ్రికల్చర్ ఇంజనీరింగ్ విభాగంలో రాష్ట్రస్థాయిలో మూడో ర్యాంక్ సాధించింది. అనకాపల్లిలో అగ్రికల్చర్ పాలిటెక్నిక్ చదివింది. తల్లిదండ్రులు గండి గోవిందా, కృష్ణవేణి వ్యవసాయదారులు. పదో తరగతి వరకు కండివరం జడ్పీ స్కూల్లో చదివిన భావన, అగ్రికల్చర్ సైంటిస్ట్ అవుతానని అంటోంది.