'దాడి చేసిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలి'

NLG: గుండ్లపల్లి(డిండి) మండలం సింగరాజుపల్లిలో బీఆర్ఎస్ నాయకులపై దాడి చేసిన కాంగ్రెస్ నాయకులపై కఠిన చర్యలు తీసుకోవాలని బీఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు మాజీ ఎమ్మెల్యే రమావత్ రవీంద్ర కుమార్ డిమాండ్ చేశారు. శుక్రవారం మాజీ సర్పంచ్ పొనుగోటి రవీందర్ రావు శ్రీపతి బొడ్డయ్య, సురేందర్ రావులను పరామర్శించారు. స్థానిక బీఆర్ఎస్ నాయకులు ఆయన వెంట ఉన్నారు.