గాజువాకలో 'నా కార్యకర్త' కార్య‌క్రమం

గాజువాకలో 'నా కార్యకర్త' కార్య‌క్రమం

VSP: ఏపీ రాష్ట్ర టీడీపీ అధ్యక్షులు, గాజువాక శాసనసభ్యులు పల్లా శ్రీనివాసరావు సోమవారం గాజువాకలో ప్రత్యేకంగా 'నా కార్యకర్త' అనే కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో నియోజకవర్గంలోని పార్టీ కార్యకర్తలతో వ్యక్తిగతంగా సమావేశమై వారి సమస్యలను, తెలుసుకున్నారు. ప్రతి ఒక్క కార్యకర్తతో మాట్లాడిన శ్రీనివాసరావు వారికి భ‌రోసా కల్పించారు.