టీఎంసీని గద్దె దింపటమే లక్ష్యంగా కాంగ్రెస్ పావులు
బెంగాల్‌లో టీఎంసీ ప్రభుత్వాన్ని గద్దె దించడమే లక్ష్యంగా కాంగ్రెస్ పావులు కదుపుతోంది. ఈ మేరకు ముస్లిం జనాభా అధికంగా ఉండే మాల్దా, ముర్షిదాబాద్, ఉత్తర దినాజ్‌పూర్, పురూలియా జిల్లాల్లో టీఎంసీని ఓడించడానికి అగ్రనేతలైన రాహుల్, ప్రియాంక గాంధీ చేత ప్రచారం చేయించాలని ఆ రాష్ట్ర కాంగ్రెస్ భావిస్తోంది. అంతేకాకుండా ఎస్సీ ఓట్ల కోసం పార్టీ చీఫ్ ఖర్గేతో ప్రచారం చేయించనుంది.