రహదారిపై గుంతలు.. ఇబ్బందుల్లో వాహనదారులు
ASF: కాగజ్ నగర్ పట్టణంలోని ఎన్టీఆర్ చౌరస్తాలోని ప్రధాన రహదారిపై గుంతలు ఏర్పడడంతో వాహనదారులు, ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. పలువురు పట్టణ వాసులు మాట్లాడుతూ.. ఎన్టీఆర్ చౌరస్తాలో గుంతలు ఏర్పడడంతో ప్రమాదాలు జరుగుతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. రాత్రి సమయంలో గుంతలు కనిపించకపోవడంతో ప్రమాదాలు జరుగుతున్నాయని స్థానికులు తెలిపారు.