రోడ్డుపై మురుగునీరు.. తీవ్ర ఇబ్బందులు
కృష్ణా: ఉంగుటూరు మండలం తేలప్రోలులో మురుగునీరు రోడ్డుపై ప్రవహిస్తుండటంతో స్థానికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ముఖ్యంగా SC కాలనీలో మురుగునీరు రహదారిపై నిలిచిపోవడంతో దుర్వాసనతో పాటు దోమల బెడద పెరిగి ఆరోగ్య సమస్యలు తలెత్తే ప్రమాదం ఉందని గ్రామస్తులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈ సమస్యకు శాశ్వత పరిష్కారం చూపాలని ప్రజలు కోరుతున్నారు.