విద్యార్థినులతో కలిసి భోజనం చేసిన కలెక్టర్

విద్యార్థినులతో కలిసి భోజనం చేసిన కలెక్టర్

KMR: మద్నూర్ మండలంలోని పెద్ద ఎక్లారా సాంఘిక సంక్షేమ గురుకుల బాలికల పాఠశాలను కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్ శనివారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ పర్యటనలో ఆయన పాఠశాలలోని స్టోర్ రూమ్‌ను స్వయంగా పరిశీలించి, విద్యార్థులకు నిల్వ ఉంచిన ఆహార పదార్థాల నాణ్యతను తనిఖీ చేశారు. ఈ సందర్భంగా మెనూ ప్రకారం విద్యార్థులకు అందుతున్న గుడ్ల పరిమాణం, నాణ్యతపై ప్రత్యేక దృష్టి సారించారు.