'వికలాంగుల సమస్యలు పరిష్కరించాలి'
ADB: బోథ్ మండల కేంద్రంలో వికలాంగుల హక్కుల పోరాట సమితి ఆధ్వర్యంలో ప్రపంచ వికలాంగుల దినోత్సవం జరుపుకున్నారు. వికలాంగుల హక్కుల పోరాట సమితి జిల్లా అధికార ప్రతినిధి షేక్ మహబూబ్ అలాగే మండల అధ్యక్షుడు మోతే రాజేశ్వర్‌లు వికలాంగుల హక్కుల పోరాట సమితి జెండా ఆవిష్కరించారు. వికలాంగులకు పింఛన్ పెంచాలని, బస్ పాస్ పూర్తిగా రాయితీ, సబ్సిడీ లోన్ ఇవ్వాలని కోరారు.