పంచాయతీ అభివృద్ధి శిక్షణా కార్యక్రమం

SS: ముదిగుబ్బలోని ఎంపీడీవో కార్యాలయంలో గ్రామపంచాయతీ అభివృద్ధి ప్రణాళిక శిక్షణ కార్యక్రమాన్ని బుధవారం ఎంపీడీవో విజయ్ భాస్కర్ ఆధ్వర్యంలో నిర్వహించారు. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఎంపీపీ ఆదినారాయణ హాజరయ్యారు. 2025- 26 సంవత్సరంలో జరగవలసిన అభివృద్ధిపై అధికారులకు శిక్షణ ఇచ్చారు. గ్రామాలన్నిటిని అన్ని విధాలుగా అభివృద్ధి చేసుకోవడమే రాష్ట్ర ప్రభుత్వ ధ్యేయమన్నారు.