పెదగంజాం విద్యార్థులకు 'శక్తి', డ్రగ్స్‌పై అవగాహన
BPT: చీరాల మండలం పెదగంజాం జెడ్పీ హైస్కూల్‌లో విద్యార్థులకు పోలీసుల అవగాహన సదస్సు జరిగింది. శక్తి బృందం ఎస్ఐ హరిబాబు, ఈగల్ టీమ్ సభ్యులు పాల్గొని 'శక్తి యాప్', దిశ యాప్‌ల వినియోగంపై వివరించారు. ఆపద సమయంలో 100, 112 నెంబర్లకు కాల్ చేయాలని, గుడ్ టచ్-బ్యాడ్ టచ్, సైబర్ నేరాలపై అప్రమత్తంగా ఉండాలని సూచించారు. డ్రగ్స్ సమాచారం ఉంటే 1972 నెంబర్‌కు తెలపాలన్నారు.