ముగిసిన గ్రంథాలయ వారోత్సవాలు
కడప నగరంలోని ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో గురువారం గ్రంథాలయ వారోత్సవాలు ఘనంగా ముగిశాయి. ఈ సందర్భంగా జిల్లా గ్రంథాలయ కార్యదర్శి ఎలిశెట్టి పవన్ కుమార్ మాట్లాడుతూ.. గ్రంథాలయాలు ఉన్నచోట విజ్ఞానవంతులు పెరిగి అభివద్ధికి తోడ్పడుతారని పేర్కొన్నారు. వివిధ కార్యక్రమాల్లో విజేతలైన వారికి బహమతులు, ధ్రువీకరణ పత్రాలు అందజేశారు. ఈ కార్యక్రమంలో విద్యార్థులు, గ్రంథాలయ సిబ్బంది పాల్గొన్నారు.