అంబేద్కర్ విగ్రహానికి వినతిపత్రం
WGL: నర్సంపేట పట్టణ కేంద్రంలోని ప్రైవేట్ డిగ్రీ కళాశాల యాజమాన్య ఆధ్వర్యంలో మంగళవారం అంబేద్కర్ విగ్రహానికి వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా ప్రిన్సిపల్ ప్రభాకర్ రెడ్డి మాట్లాడుతూ..పెండింగ్‌లో ఉన్న స్కాలర్‌షిప్, ఫీజు రీయింబర్స్‌మెంట్ నిధులు రాకపోవడంతో కళాశాల నిర్వహణ ఇబ్బందిగా మారిందని తెలిపారు. CM స్పందించి రీయింబర్స్‌మెంట్ నిధులు విడుదల చేయాలని కోరారు.