నేడు విద్యుత్తు సరఫరా నిలిపివేత

ప్రకాశం: వెలిగండ్ల విద్యుత్ శాఖ ఏ.ఈ రసూల్ రైతులకు విద్యుత్ సరఫరాపై సూచనలు చేశారు. ఆదివారం ఉదయం 6 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు వ్యవసాయ విద్యుత్ సరఫరా చేస్తామన్నారు. 1 గంట నుంచి సాయంత్రం 6 వరకు విద్యుత్ సరఫరా ఉండదని తెలిపారు. ఆర్.జి.పురం, మరపగుంట్ల ఫీడర్లకు ఆర్ డి ఎస్ ఎస్ పనుల కారణంగా అంతరాయం ఉంటుదని వినియోగదారులు సహకరించాలని కోరారు.