ఎమ్మెల్యే అనిల్ ప్రోటోకాల్ ఉల్లంఘించారు: సుగుణ
ADB: బోథ్ మండల కేంద్రంలో బుధవారం జరిగిన కల్యాణలక్ష్మి, షాదీ ముబారక్ చెక్కుల పంపిణీని కార్యక్రమంలో ఎమ్మెల్యే అనిల్ జాదవ్ ప్రోటోకాల్‌ను ఉల్లంఘించారని గురువారం టీపీసీసీ ఉపాధ్యక్షురాలు, ఆదిలాబాద్ పార్లమెంట్ ఇన్‌ఛార్జ్ ఆత్రం సుగుణ ఆరోపించారు. ప్రభుత్వ కార్యక్రమాన్ని తమ బీఆర్ఎస్ పార్టీ కార్యక్రమంగా నిర్వహించారన్నారు. ఇది సరైన విధానం కాదని పేర్కొన్నారు.