గర్భ కోశ వ్యాధుల చికిత్స శిబిరాన్ని ప్రారంభించిన ఎమ్మెల్యే
E.G: పశు పోషణ ప్రోత్సహించేందుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అనేక కార్యక్రమాలు చేపడుతున్నాయని ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డి అన్నారు. బిక్కవోలు మండలం ఇళ్లపల్లిలో రాష్ట్రీయ గోకుల్ మిషన్, పశుసంవర్ధక శాఖ ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన ఉచిత గర్భకోశ వ్యాధుల చికిత్స శిబిరాన్ని ఎమ్మెల్యే రామకృష్ణారెడ్డి గురువారం ముందుగా గోవు పూజ చేసి, ప్రారంభించారు.