మహాజన కార్మిక సంఘాల సమైక్య అధ్యక్షునిగా బాలస్వామి

వనపర్తి: జిల్లా బీసీఎఫ్ రాష్ట్ర అధ్యక్షులు చెన్న రాములు ఆధ్వర్యంలో ఆయన స్వగృహంలో మహాజన కార్మిక సంఘాల సమైక్య జిల్లా అధ్యక్షునిగా బాలస్వామిని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. ఈ సందర్భంగా చెన్న రాములు మాట్లాడుతూ.. అనేక సంవత్సరాలుగా కార్మిక సంఘానికి నాయకత్వం వహిస్తూ, కార్మికుల సంక్షేమం కోసం కృషి చేసిన బాలస్వామిని ఎన్నుకోవడం హర్షించదగిన విషయమన్నారు.