విద్యుత్, రెవెన్యూ సమస్యలను త్వరగా పరిష్కరించాలి

అన్నమయ్య: ప్రజలకు ఉన్న విద్యుత్, రెవెన్యూ సమస్యలను త్వరగా పరిష్కరించాలని రాష్ట్ర రవాణా మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి అధికారులకు ఆదేశించారు. ఈ మేరకు శనివారం రాయచోటిలోని తన క్యాంప్ కార్యాలయంలో ప్రజాదర్బార్ నిర్వహించారు. అనంతరం అక్కడికి వచ్చిన ప్రజల నుండి అర్జీలను స్వీకరించి, సంబంధిత అధికారులకు పలు ఆదేశాలు జారీ చేశారు.