'లడ్డు వివాదంపై చర్యలు తీసుకోవాలి'
VSP: తిరుమల లడ్డు అంశంపై బాధ్యులపై వెంటనే చర్యలు తీసుకోవాలని సాధు పరిషత్ అధ్యక్షులు శ్రీనివాసానంద సరస్వతి డిమాండ్ చేశారు. ఇప్పటికే సిట్, ఎన్‌డీడీబీ నివేదికలు ఉన్నాయని వాటిని బయటపెట్టాలని అన్నారు. ఈమేరకు విశాఖలో ఆయన మీడియాతో మాట్లాడారు. లడ్డు నాణ్యతపై అనుమానాలు వ్యక్తమైన తర్వాత కూడా చర్యల్లో ఆలస్యం ఎందుకని ప్రశ్నించారు.